- నదుల గురించి అధ్యయనం చేయడాన్ని పొటమాలజీ అని పిలుస్తారు.
- మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు.
- భారతదేశంలో నవంబర్ 24 నుంచి 27 వరకు నదీవారం నిర్వహిస్తారు.
- సుస్థిరాభివృద్ధికి నీటిపై చర్య అంతర్జాతీయ దశాబ్దం 2018–2028.
- దక్షిణ భారతదేశంలో పరీవాహక ప్రాంతం ఆధారంగా అతి పెద్ద నది గోదావరి.
- తెలంగాణలో గోదావరిని కలిసే మొదటి ఉప నది మంజీర.
- తెలంగాణలో గోదావరిని కలిసే చివరి ఉప నది ఇంద్రావతి.
- గోదావరి, మంజీర కలిసే ప్రాంతం బాదనకుర్తి.
- గోదావరి, ప్రాణహిత నదులు కలిసే ప్రాంతం కాళేశ్వరం.
- గోదావరి నది తెలంగాణలో ఎనిమిది జిల్లాల గుండా ప్రవహిస్తోంది.
- దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి.
- గోదావరి నది మొత్తం పరీవాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ.
- గోదావరి నది ఏర్పాటు చేసిన నదీ ఆధారిత దీవి బాదనకుర్తి.
- ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది.
- గోదావరి నది చెగ్గాం,పెద్దపల్లి, జగిత్యాల సరిహద్దు ప్రాంతంలో చంద్రవంక ఆకారంలో ప్రవహిస్తుంది.
- దక్షిణ త్రివేణి సంగమం ఏర్పాటు చేసే నది గోదావరి.
- గోదావరి నది జన్మస్థానం త్రయంబకేశ్వరం.
- గోదావరి తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం కందకుర్తి.
- గోదావరి పరీవాహక ప్రాంతం అధికంగా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర.
- గోదావరి పరీవాహక ప్రాంతం అతి తక్కువ కలిగిన రాష్ట్రం కర్ణాటక.
- గోదావరి దక్షిణ త్రివేణి సంగమాన్ని కాళేశ్వరం ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది.
- తెలంగాణలో గోదావరి నది పొడవు 520 కి.మీ.
- సహ్యాద్రి కొండల్లో గోదావరి నది ప్రవహిస్తుంది.
- గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ.
- తెలంగాణలో దక్షిణ వాహినిగా ప్రవహించే నది గోదావరి.
- గోదావరి పరీవాహక ప్రాంతం తెలంగాణలో 19.87శాతం ఉంది.
- ఇండియన్ రైన్ అని గోదావరి నదిని పిలుస్తారు.
- కోటి లింగాల క్షేత్రం గోదావరి నదీ ఒడ్డున ఉంది.
- మంజీరా నది జన్మస్థానం బాలాఘాట్ కొండలు.
- మంజీరా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది.
- మంజీరా నదిని మహారాష్ట్రలో మాంజ్రా అనే పేరుతో పిలుస్తారు.
- మంజీరా నది పొడవు 724 కి.మీ.
- ఒడిశాలోని తూర్పు కనుమల్లోని సికారం కొండల్లో జన్మించే నది శబరి.
- ఒడిశాలో కొలాబ్ నది అని హరిద్రను పిలుస్తారు.
- ఇంద్రావతి నది జన్మస్థానం కలహండి.
- చిత్రకూట్ జలపాతాన్ని ఏర్పాటు చేసే నది ఇంద్రావతి.
- పెన్‌గంగా నది జన్మస్థానం అజంతా శ్రేణి.
- లెండి నది మంజీర నదికి ఉపనది.
- గోదావరి ఉప నదుల్లో అతి పెద్ద నది శబరి.
- ప్రాణహిత నది తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల గుండా ప్రవహిస్తోంది.
- మానేరు నది జన్మస్థానం సిరిసిల్లకొండ.
- మానేరు నది గోదావరిలో అన్నారం బ్యారేజీ వద్ద కలుస్తుంది.
- కడెం నది జన్మస్థానం బోతాయిపల్లి.
- ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం భద్రకాళి.
- కరీంనగర్ పట్టణం మానేరు నది ఒడ్డున ఉంది.
- వార్దా నది జన్మస్థానం ముల్తాయి తహశీల్.
- కడెం నది ఏర్పాటు చేసే అతి ఎత్తయిన జలపాతం కుంతాల.
- గోదావరి, మంజీరా నదులతో కలిసి సరస్వతి నది కందకుర్తి వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేస్తుంది.
- కడెం నది గోదావరిని కలిసే ప్రాంతం పసుపుల గ్రామం.
- కిన్నెరసాని నదీ జన్మస్థానం తాడ్వాయి.