జలావరణం
- సాధారణంగా మహాసముద్రాల్లో చమురు నిల్వలు ఖండాంతర తీరాలకు పరిమితమై ఉంటాయి.
- ఈత కొట్టడం సముద్ర జలాల్లో తేలిక.
- ప్రపంచంలో అత్యధికంగా చేపలు దొరికే ప్రాంతాలు ఉష్ణ, శీతల ప్రవాహాలు కలిసే చోట.
- డెడ్ సీ అత్యధిక లవణీయత కలిగిన సముద్రం.
- సముద్రంలో సోడియం క్లోరైడ్తోపాటు ఐయోడిన్ అనే పదార్థం వ్యాపార సరళిలో లభిస్తుంది.
- సముద్రంలో అలలు ఏర్పడటానికి కారణం సూర్యుని, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి.
- పాథోమీటర్ను సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగిస్తారు.
- నెల పొడుపు సమయంలో సముద్రపు పోట్లు పౌర్ణమి రోజుల్లో కలుగుతాయి.
- పసిఫిక్ సముద్రానికి ఆ పేరు పెట్టింది మాగెల్లా.
- ప్రపంచంలో లోతైన కందకం పసిఫిక్ మహాసముద్రం.
- హిందూ మహాసముద్ర ద్వీపం డిగోగార్షియా మిలటరీ స్థావరం కలిగిన దేశం అమెరికా.
- డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న స్థలం ఇంగ్లండ్.
- చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటే అధికమైందని భూగోళానికి సంబంధించిన దానిని రుజువు చేయలేం.
- సముద్రపు లోతును పాథమ్స్ యూనిట్లలో కొలుస్తారు.
- ఉత్తర అట్లాంటిక్ అత్యంత రద్దీ అయిన సముద్ర మార్గం.
- భూమిపై తాగడానికి కావాల్సిన స్వచ్ఛమైన మంచినీటి లభ్యత 1 శాతం.
- సముద్ర జీవారణ వ్యవస్థ భూమి ఉపరితలంలో అత్యధిక భాగాన్ని ఆవరించి ఉంది.
- సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ గోవాలో ఉంది.
- ప్రపంచ నీటి వనరులు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకుంటారు.
- నీరు నిత్యం తన రూపాన్ని మార్చుకుంటూ మహాసముద్రాలు, వాతావరణం, నేల మధ్య ప్రవహించే ప్రక్రియను జల వలయం అంటారు.
- కవోష్ణ మహాసముద్ర జల ప్రవాహాలు భూమధ్యరేఖ వద్ద ఉద్భవిస్తాయి.
- రోజుకు రెండు సార్లు మహాసముద్ర జలం లయబద్ధంగా ఎగిసి పడటాన్ని పోటుపాటులు అంటారు.
- 1000 గ్రాముల నీటిలో ఉప్పు పరిమాణాన్ని లవణీయత అని పిలుస్తారు.
- మహాసముద్రం సగటు లవణీయత 35. (1000 గ్రాముల్లో 35 గ్రాములు)
- మహాసముద్రంలో అత్యధికంగా కరిగి ఉన్న లవణం సోడియం క్లోరైడ్.
- ఆరెంజ్ నది దక్షిణాఫ్రికా దేశంలో ఉంది.
- మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంది.
- మృత సముద్రం సగటు లవణీయత లీటరుకు 340 గ్రాములు.
- మంచినీటికి అతిపెద్ద వనరు హిమశిరోవేష్టాలు (ఐస్ క్యాప్స్)
- అవపాతం మహాసముద్ర జల చలనం కాదు.
- మహాసముద్రం ఉపరితలంపై నీరు ఎగసి పడుతుండటాన్ని తరంగాలు అంటారు.
- సునామీలను హార్బర్ వేవ్ అంటారు.
- సునామీ తరంగాల ప్రయాణ వేగం నీటి లోతును బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.
- పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై ఉంటాయి. పోటుపాటులు అధికంగా ఉంటాయి. ఈ పోటుపాటులను పర్వవేలా తరంగాలు (స్ప్రింగ్ టైడ్స్) అని పిలుస్తారు.
- చంద్రుడి తన మొదటి, చివరి చతుర్ధాంశంలో ఉన్నప్పుడు మహాసముద్ర జలాలు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలం కారణంగా వ్యతిరేక దిశలో లాగబడతాయి. తద్వారా అల్ప పోటుపాటులు ఏర్పడుతాయి. వీటిని లఘువేలా తరంగాలు అంటారు.
- మహాసముద్ర ఉపరితలంలో నీటి ప్రవాహం స్థిరంగా నిశ్చితమైన దిశల్లో ప్రవహించడాన్ని ప్రవాహాలు అంటారు.
- పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు అలస్కా, కాలిఫోర్నియా, హంబోల్డ్స్ ప్రవాహాలు.
- అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలు లాబ్రడార్, కేనరీ, బెంగ్వెలా ప్రవాహాలు.
- అలస్కా ప్రవాహం కవోష్ణ ప్రవాహం.
- ఆగుల్హాస్ ప్రవాహం శీతల ప్రవాహం.
- ఉపరితలం విస్తీర్ణం రీత్యా ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు.
- నీటి పరిమాణం రీత్యా ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు బైకాల్.
- ఆఫ్రికాల్ పెద్ద సరస్సు విక్టోరియా.
- రష్యాలో ఉన్న సరస్సు బైకాల్.
- ఉత్తర అమెరికాలో ఉన్న సరస్సు సుపీరియర్.
- కవోష్ణ మహాసముద్ర ప్రవాహాలు ద్రువాల వద్ద జన్మిస్తాయి.
- తరంగాలు గంటకు 700 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయి.
- భూ జలతలం (వాటర్ టేబుల్) తరిగిపోవడానికి కారణాలు జనాభా పెరుగుదల, వ్యవసాయ కార్యకలాపాలు, పెరుగుతున్న పరిశ్రమలు .
- భూ ఉపరితలంపై 97.5 శాతం లవణ జలం ఉంది.
- భూమధ్యరేఖ వద్ద మొదలై ధ్రువం వైపు కదిలే ప్రవాహం కవోష్ణ మహాసముద్ర ప్రవాహాలు.
- సునామీ అనేది జపనీస్ పదం.