
- దేశంలో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు(1962కి.మీ.), గుజరాత్(1054), ఆంధ్రప్రదేశ్(974కి.మీ.)
- పశ్చిమ తీర మైదానం ఉత్తరాన రాణా ఆఫ్ కచ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు 1840 కి.మీ. విస్తరించి ఉంది.
- పశ్చిమ తీరమైదానంలో ఉప్పునీటి కయ్యలు, వేలా తరంగా ప్రవేశ ద్వారాలు, నదీ ముఖద్వారాలు, బురద నేలలు, రాన్ కనిపిస్తాయి.
- పశ్చిమతీర మైదానంలో వేలా తరంగాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల తీర రేఖ క్రమక్షయం అధికంగా ఉంది.
- అరేబియా సముద్రం క్రమంగా ఖండ భూభాగంలోకి చొచ్చుకుని వస్తుంది. దీని మూలంగా పశ్చిమతీర మైదానం సముద్ర ముంపునకు గురవుతూ క్రమంగా నిమజ్జిత తీరంగా మారిపోతుంది.
- పశ్చిమ తీర రేఖ సచ్ఛిద్రంగా రంపపు పండ్ల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. తీరరేఖ సమీపంలో తీరమైదానంపై భ్రంశాలు ఏర్పడి ఉన్నాయి. వీటి మూలంగా పశ్చిమ తీర మైదానం సహజ ఓడరేవులకు ప్రసిద్ధి చెందింది.
- పశ్చిమ తీర మైదానాన్ని గుజరాత్, కొంకణ్, కర్ణాటక, కేరళ మైదానం అని పిలుస్తారు.
- గుజరాత్ మైదానం గుజరాత్ నుంచి డామన్ వరకు విస్తరించి ఉంది. కొంకణ్ మైదానం డామన్ నుంచి గోవా వరకు విస్తరించింది ఉంది. కర్ణాటక మైదానాన్ని కెనరా తీరం అని కూడా అంటారు. ఇది గోవా నుంచి కన్ననూర్ వరకు విస్తరించి ఉంది. కేరళ మైదానం కన్ననూరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది.
- తూర్పు తీర మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఈశాన్యంగా సువర్ణరేఖ నది మీదుగా గంగానది ముఖద్వారం వరకు 1800కి.మీ. విస్తరించి ఉంది.
- పశ్చిమ తీర మైదానం కంటే తూర్పు తీరమైదానం వెడల్పుగా ఉంటుంది.
- తూర్పు తీర మైదానం విశాలమైన బీచ్లతో నిర్మితమైంది.
- విరూపకారక బలాల వల్ల బంగాళాఖాతం ఖండ భూభాగం నుంచి క్రమంగా తిరోగమిస్తుంది.
- తూర్పు తీరంలో హుగ్లీ నది ముఖద్వారం వద్ద సముద్రంలోని ఖండ భాగాలు తిరోగమనం చెందడం వల్ల న్యూమూర్ దీవులు ఆవిర్భవించాయి.
- కృష్ణ, గోదావరి డెల్టా మధ్య ఉన్న కొల్లేరు సరస్సు పురాతన కాలంలో ఉప్పునీటి సరస్సు అని ఇటీవల పరిశోధనలో నిర్ధారించారు.
- కొల్లేరు సరస్సు ఒకప్పుడు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు, తర్వాత కాలంలో బంగాళాఖాతం క్రమంగా ఖండ భూభాగం నుంచి తిరోగమించడంతో కొల్లేరు సరస్సు ప్రస్తుతం తీరానికి దూరంగా ఖండ భూభాగంపై మంచినీటి సరస్సుగా ఆవిర్భవించింది.
- తూర్పు తీరంలో తీరరేఖ సూటిగా సన్నగా ఉండటంతో సహజ ఓడరేవులు తక్కువగా ఏర్పడ్డాయి.
- తూర్పు తీరమైదానాన్ని ప్రాంతీయంగా తమిళనాడు, ఆంధ్ర, ఉత్కళ, వంగ తీర మైదానాలుగా విభజించవచ్చు.
- తమిళనాడు మైదానాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో దీన్ని పేరు చోళ మండలం అని పిలిచేవారు. ఇది కన్యాకుమారి నుంచి పులికాట్ సరస్సు వరకు వ్యాపించి ఉంది.
- ఆంధ్ర మైదానాన్ని కోస్తా తీరం/ సర్కార్ తీరం అంటారు. ఇది పులికాట్ సరస్సు నుంచి బరంపురం (ఒడిశా రాష్ట్రం) వరకు విస్తరించి ఉంది.
- ఉత్కళ మైదానం బరంపురం నుంచి సుందర్బన్స్ వరకు విస్తరించి ఉంది. దీనిని కాంతి తీర మైదానం అంటారు.