- 1909లో హైదరాబాద్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది.
- 1912లో హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏర్పడింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం.
- 1920లో హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభమైంది.
- పూర్వ ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 53.89శాతం, 46.11శాతం పంపిణీ చేశారు.
- 2020 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు.
- తెలంగాణలో ప్రభుత్వరంగ విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం 5825 మెగావాట్లు.
- తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 2567 మెగావాట్లు.
- ఆసియాలోనే మొదటి జల విద్యుత్ కేంద్రాన్ని భారతదేశంలో 1902లో ప్రారంభించారు.
- నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 86 మెగావాట్లు.
- ప్రియదర్శిని జల విద్యుత్ కేంద్రాన్ని 1995లో ప్రారంభించారు.
- ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 మెగావాట్లు.
- సింగూరు జల విద్యుత్ కేంద్రం సంగారెడ్డి జిల్లాలో ఉంది.
- తెలంగాణలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం శ్రీశైలం.
- నాగార్జున సాగర్ ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 60 మెగావాట్లు.
- పుట్టంగండి జల విద్యుత్ కేంద్రం నల్గొండ జిల్లాలో ఉంది.
- బయోగ్యాస్ ప్లాంట్లు అధికంగా కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి.
- పుట్టంగండి జల విద్యుత్ కేంద్రం విద్యుత్ సామర్థ్యం 72 మెగావాట్లు.
- తెలంగాణలో మొదటి సౌర విద్యుత్ కేంద్రం జూరాలలో ఏర్పాటు చేశారు.
- సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర స్థాపిత సామర్థ్యం 3645 మెగావాట్లు.
- పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో జర్మనీ దేశం ఉంది.
- కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1720 మెగావాట్లు.
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ను 1975లో స్థాపించారు.
- కొత్తగూడెం థర్మల్ పవర్ కార్పొరేషన్‌ను1966లో స్థాపించారు.
- కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా జరుగుతోంది.
- రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 1983లో స్థాపించారు.
- రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2600 మెగావాట్లు.
- రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా చేసే ప్రాజెక్టు శ్రీరాంసాగర్.
- రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం పెద్దపల్లి జిల్లాలో ఉంది.
- కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్–1ను 2010లో ప్రారంభించారు.
- కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్–1 విద్యుత్ స్థాపిత సామర్థ్యం 500 మెగావాట్లు.
- కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్–2ను 2016లో ప్రారంభించారు.
- కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లాలో స్థాపించారు.
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నల్గొండ జిల్లాలో ఉంది.