- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు.
- 1963లో శ్రీరాంసాగర్ పనులు ప్రారంభించారు.
- తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు శ్రీరాంసాగర్.
- సరస్వతి కాలువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది.
- ప్రియదర్శిని ప్రాజెక్టు గద్వాల జిల్లాలో ఉంది.
- జూరాల ప్రాజెక్టు 1995లో పూర్తయింది.
- తెలంగాణలో అత్యధిక బ్లాకులు కలిగిన ప్రాజెక్టు జూరాల.
- రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు శ్రీరాం సాగర్ నుంచి నీటిని సరఫరా చేస్తారు.
- తెలంగాణలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ కాకతీయ కాలువ.
- నల్ల సోమునాద్రి కాలువ జూరాల ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది.
- నిజాంసాగర్ ప్రాజెక్టు మంజీరా నదిపై ఉంది.
- 1923లో నిజాంసాగర్ డ్యాం నిర్మాణం ప్రారంభమైంది.
- - కాకతీయ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలవుతుంది.
- శ్రీరాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు.
- లోయర్ మానేరు డ్యాం కరీంనగర్ జిల్లాలో ఉంది.
- శ్రీపాద సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మించారు.
- సుందిళ్ల ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలో ఉంది.
- అన్నారం బ్యారేజీ భూపాలపల్లి జిల్లాలో ఉంది.
- చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలో ఉంది.
- సీతారామ ప్రాజెక్టు ములుగు జిల్లాలో ఉంది.
- నక్కల గండి ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉంది.
- ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉంది.
- ఘన్పూర్ ప్రాజెక్టు మంజీర నదిపై ఉంది.
- ఆసిఫ్ నగర్ ప్రాజెక్టు మూసీ నదిపై యాదాద్రి జిల్లాలో ఉంది.
- పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్, వట్టెం, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులు భాగం.
- భక్తరామదాసు ప్రాజెక్టు పాలేరు నదిపై ఉంది.
- బయ్యారం చెరువు మహబూబాబాద్ జిల్లాలో ఉంది.
- పాకాల చెరువు వరంగల్ జిల్లాలో ఉంది.
- లక్నవరం సరస్సు ములుగు జిల్లాలో ఉంది.
- మోడికుంట వాగు ప్రాజెక్టు ములుగు జిల్లాలో ఉంది.
- రామప్ప సరస్సు ములుగు జిల్లాలో ఉంది.
- చెలిమెల వాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది.
- మీర్ ఆలం చెరువు హైదరాబాద్ జిల్లాలో ఉంది.
- మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నదిపై భూపాలపల్లి జిల్లాలో నిర్మించారు.
- ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టును మూసీ నదిపై నిర్మించారు.
- భూమిపై స్వర్గాన్ని చూడాలంటే వెన్నెల రాత్రుల్లో ఈ చెరువును చూడాలి అని లోకోక్తి కలిగిన చెరువు పాకాల చెరువు.
- మిషన్ కాకతీయ పథకం నినాదం మన ఊరు – మన చెరువు.
- నిర్మల్ పట్టణానికి తాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టు స్వర్ణ.
- ఆంధ్రప్రదేశ్ – తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు పులిచింతల.
- గొల్లవాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
- వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది.
- మిడ్ మానేరు ప్రాజెక్టు సిరిసిల్ల ప్రాజెక్టులో ఉంది.
- మల్లన్న సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో ఉంది.
- పాములపర్తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
- ఎగుమ మానేరు ప్రాజెక్టు సిరిసిల్ల జిల్లాలో ఉంది.
- తాలిపేరు వాగు ప్రాజెక్టు కొత్తగూడెం జిల్లాలో ఉంది.
- గొల్లవాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
- వైరా ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలో ఉంది.
- కోటిపల్లి వాగు ప్రాజెక్టు కాగ్నా నదిపై ఉంది.
- తుపాకుల గూడెం ప్రాజెక్టుకు కంతనపల్లి సుజల స్రవంతి అనే మరో పేరు ఉంది.
- లెండి ప్రాజెక్ట్ మహారాష్ట్రలో నిర్మించారు.