బిట్ బ్యాంక్ : తెలంగాణ మహాసభ
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం 1968–69 మధ్యకాలంలో ఉద్యమం జరిగింది.
- నీలం సంజీవరెడ్డి తర్వాత దామోదరం సంజీవయ్య ఏపీ సీఎం అయ్యారు.
- దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్న కాలంలో కొండా వెంకట రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు.
- కొండా వెంకట రంగారెడ్డి 1959 నుంచి 1962 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
- 1962 తర్వాత 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవిని పక్కనపెట్టారు.
- 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉప ముఖ్యమంత్రిగా సమైక్యతావాది అయిన కరీంనగర్‌కు చెందిన జేవీ నరసింగరావును నియమించారు.
- బూర్గుల రామకృష్ణారావు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా వివక్ష చూపారు.
- భారత్, పాకిస్తాన్ యుద్ధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 10శాతం కోత విధించి పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడంతో తెలంగాణలో చాలా మంది ఇంజినీర్లు 1965–66 మధ్యకాలంలో నిరుద్యోగులయ్యారు.
- తెలంగాణలో ఉన్న పర్మినెంట్ పోస్టులన్నీ ఆంధ్రవారు ఆక్రమించి, తాత్కాలిక సూపర్ న్యూమరి పోస్టులను తెలంగాణ వారికి కేటాయించారు. దీంతో తాత్కాలిక ఉద్యోగులను తొలగించినప్పుడు తెలంగాణ వారు నిరుద్యోగులు కావాల్సి వచ్చింది.
- ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పదోన్నతులు, పే స్కేళ్ల విషయంలో తెలంగాణ ఇంజినీర్లు అన్యాయానికి గురయ్యారు.
- 1967 నాటికి తెలంగాణలో ఆంధ్ర టీచర్ల సంఖ్య 4000కు చేరుతుంది.
- ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను తొక్కివేయడంతోపాటు ప్రజా ఉద్యోగ చట్టం –1957ను కూడా ఉల్లంఘించారు.
- రెండు ప్రాంతాల సివిల్ సర్వీస్ అధికారుల సీనియారిటీలను కలిపేసి, కామన్ సీనియారిటీ జాబితాను రూపొందించి, ఆంధ్రా ప్రాంతపు నియమ నిబంధనలను అమలు చేయడంతో ప్రమోషన్లలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది.
- 1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని ఐదో అధ్యాయం 47 నుంచి 50 సెక్షన్ల ప్రకారం తెలంగాణ వ్యవసాయ భూములను తెలంగాణేతరులు కొనడం చట్ట విరుద్ధం.
- 1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టాన్ని ఉల్లంఘించి, 1956కు ముందు ఆంధ్రవారు నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారు.
- పెద్ద మనుషుల ఒప్పందంలోని 8వ అంశం ప్రకారం తెలంగాణలోని వ్యవసాయ భూములను అమ్మడం, కొనడం తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారానికి లోబడి ఉండాలి.
- తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండా ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారు.
- 1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని 47 నుంచి 50 వరకు గల సెక్షన్లను 1968లో పూర్తిగా రద్దు చేశారు.
- వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 60 నుంచి 80శాతం మాగాణి భూమి స్థానిక రైతుల నుంచి ఆంధ్రా వలసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
- నిజాంసాగర్ కింద సారవంతమైన భూమిలో 40శాతం వలసవాదుల చేతుల్లోకి వెళ్లింది.
- ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 17 నెలలకు నాటి పాలకులు జరిపిన అన్యాయాలను వేలెత్తి చూపే సాహసం చేసిన సంస్థ తెలంగాణ మహాసభ.
- తెలంగాణ మహాసభ నాటికి పాలకులు చేస్తున్న అన్యాయాలపై కేంద్ర విదేశాంగ మంత్రి గోవింద వల్లభ్ పంత్‌కు విజ్ఞాపన పత్రాన్ని పంపింది.