- దేశంలో తొలి బీహెచ్ఈఎల్ను 1956లో స్థాపించారు.
- తెలంగాణ రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ను 1963లో స్థాపించారు.
- తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రాపురం ప్రాంతంలో బీహెచ్ఈఎల్ను స్థాపించారు.
- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1967లో స్థాపించారు.
- తెలంగాణ రాష్ట్రంలోని ఏఎస్రావు నగర్ ప్రాంతంలో ఈసీఐఎల్‌ను స్థాపించారు.
- ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కోసం కోచ్‌లను భారత్ ఎర్త్ మూవర్స్ తయారు చేస్తోంది.
- తెలంగాణలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్‌ను 1961లో స్థాపించారు.
- హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తారు.
- ఐడీపీఎల్‌ను తెలంగాణలోని బాలానగర్ ప్రాంతంలో స్థాపించారు.
- ఔషధ తయారీలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
- ఆసియాలో అతిపెద్ద యాంటీబయోటిక్స్ తయారీ కేంద్రం రిషికేష్ ప్రాంతంలో ఉంది.
- దేశంలో మొదటి ఔషధ తయారీ పరిశ్రమ పింప్రిలో ఉంది.
- హైదరాబాద్‌లో రెడ్డీస్ ల్యాబోరేటరీని 1984లో స్థాపించారు.
- హెపటైటిస్ టీకా ఎస్హెచ్ఏఎన్వీఏసీను శాంతాబయోటెక్ సంస్థ తయారు చేస్తోంది.
- జీనోమ్ వ్యాలీ బాచుపల్లి ప్రాంతంలో ఉంది.
- శాంతాబయోటెక్ 1993లో స్థాపించారు.
- భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలో మొదటి బయోటెక్ పార్క్‌ల సమూహ జీనోమ్ వ్యాలీ.
- అప్పెరల్ పార్క్ గుండ్లపోచంపల్లి ప్రాంతంలో ఉంది.
- సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ ప్రాంతంలో మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది.
- హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ హైదరాబాద్, రూప్నారాయణ్ ప్రాంతంలో ఉంది.
- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను 1964లో స్థాపించారు.
- హెచ్ఏఎల్ను హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్‌లోని హెచ్‌ఏల్‌లో విమానాలకు సంబంధించి విడిభాగాలు మిగ్ విమానాల ఎలక్ట్రిక్ పరికరాలు తయారవుతాయి.
- హైదరాబాద్‌లో మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్‌ను 1973లో స్థాపించారు.
- రిఫ్రిజరేటర్లు, బ్యాలెట్ బాక్సులు, బస్సుబాడీలు ఆల్విన్ పరిశ్రమలో తయారవుతాయి.
- గ్యాస్ సిలిండర్లు ఎలక్ట్రోలక్స్ పరిశ్రమలో తయారవుతాయి.
- తెలంగాణలో భారజల కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు.
- న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది.
- రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతంలో ప్రపంచస్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేయబోతున్నారు.
- నిర్మల్ పెయింటింగ్స్, టాయ్స్ పరిశ్రమ 1955లో ఏర్పడింది.
- నిర్మల్ పెయింటింగ్స్, టాయ్స్ తయారీలో పునికి కలపను వాడుతారు.
- దమ్ముగూడెం ప్రాంతం లేసుల తయారీ పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచింది.
- డోక్రామెటల్ క్రాప్ట్స్కు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు ప్రసిద్ధి.
- డోక్రామెటల్ క్రాప్ట్స్ తయారీలో ఎర్రమట్టి, మైనం, ఇత్తడి ఉపయోగిస్తారు.
- తెలంగాణలో ముత్యాల ఉత్పత్తికి చందంపేట ప్రాంతం ప్రసిద్ధి.
- తివాచీలకు వరంగల్ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
- సిల్వర్ ఫిలిగ్రికి కరీంనగర్ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
- పెంబర్తి ఇత్తడికళకు ప్రసిద్ధి.
- గొల్లభామ చీరలకు సిద్దిపేట ప్రాంతం ప్రసిద్ధి.
- సిద్దిపేట గొల్లభామ వస్త్రాలకు 2012లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
- గద్వాల్ చీరలకు 2011లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
- పోచంపల్లి ఇక్కత్ చీరలను 1956లో మొదటిసారిగా కర్నాటి అనంతరాములు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.