
పల్లెటూరి పిల్లగాడ పాట రచయిత సుద్దాల హన్మంతు.
బండి వెనుక బండికట్టి – నైజాం సర్కారోడా పాట రయిత బండి యాదగిరి.
ఓ నిజాము పిశాచమా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ వంటి కవితలను దాశరథి కృష్ణమాచార్యులు రచించారు.
తెలంగాణ ప్రజలపై రామాంజనేయులు స్మృతి గీతాలు, కాళోజీ గీతాలు ప్రభావం చూపాయి.
సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దిమ్మిస అనే కవితా సంకలనం వెలువడింది.
మిలియన్ మార్చ్‌లో విగ్రహాల ధ్వంసం నేపథ్యంగా దిమ్మిస కవితా సంకలనం వచ్చింది.
2006 నుంచి 2010 వరకు వరుసగా ఐదు తెలంగాణ కవితా సంకలనాలను సుంకర రమేశ్ తీసుకువచ్చారు.
ఆచార్య జయశంకర్ స్మృతి కవితా సంకలనం జయ శిఖరం పేరిట వెలువడింది.
జయశిఖరం కవితా సంకలనం వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో వెలువడింది.
మత్తడి సంకలనాన్ని అంబటి సురేందర్రాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకువచ్చారు.
పొక్కిలి కవితా సంకలనం 2002లో వెలువడింది.
పొక్కిలి కవితా సంకలనాన్ని జూలూరి గౌరీశంకర్ తీసుకువచ్చారు.
1969–73 తెలంగాణ ఉద్యమ కవిత్వం సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకుచ్చారు.
తెలంగాణ చౌక్ పేరిట తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించిన కథలు కర్ర ఎల్లారెడ్డి, బి.వి.ఎన్.స్వామి సంపాదకత్వంలో వెలువడ్డాయి.
తెలంగాణ చౌక్‌లోని కథనాలు – రచయితలు
మా పంతులు: పి.యశోదారెడ్డి
యుద్ధనాదం: పెద్దింటి అశోక్ కుమార్
రేపుమాపు:పెద్దింటి అశోక్ కుమార్
కొత్త రంగులద్దుకున్న కల: బెజ్జారపు రవీందర్
నిత్యగాయాల నది: బెజ్జారపు రవీందర్
నాలుగు కోట్ల పిడికిలి: వెల్దండి శ్రీధర్
తెలంగాణం: ఓదెల వెంకటేశ్వర్లు
తెలంగాణ ఉద్యమాన్ని చిత్రించిన నవలలు – రచయిత
సలాం హైదరాబాద్: పరవస్తు లోకేశ్వర్
ముళ్లపొదలు: అంపశయ్య నవీన్
లోచూపు: బి.ఎస్.రాములు
తెలంగాణ నూటొక్క పోరు పాటలు జయధీర్ తిరుమలరావు సంపాదకత్వంలో ఒక్కొక్క పాటేసి పేరిట సంకలనంగా వచ్చాయి.
తెలంగాణ రచయిత వేదిక, తెలంగాణ సింగిడి రచయితల సంఘం ఆధ్వర్యంలో 2011, ఫిబ్రవరి 27న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ కవుల గర్జన సభ జరిగింది.
తెలంగాణ రచయితల వేదిక 2011 ఏప్రిల్ 13న ట్యాంక్‌బండ్‌పై పోతన విగ్రహం వద్ద వ్యాస సంకలనం విరుగుడును ఆవిష్కరించారు.
ప్రగతిశీల సాహిత్య ప్రస్థానంలో 25ఏళ్లు పూర్తి చేసుకున్న మంజీర రచయితల సంఘం రజతోత్సవ సభలు 2011 జులై 23న జరిగాయి.
మంజీర రచయితల సంఘం రజతోత్సవ సభలు సిద్దిపేటలో జరిగాయి.
దగాపడ్డ తెలంగాణ రచయిత గాదె ఇన్నయ్య.
తల్లడిల్లుతున్న తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రొ. విశ్వేశ్వరరావు, సింహాద్రి వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ – తెలంగాణ రాజకీయాలు అనే గ్రంథాన్ని హ్యూగ్ గ్రే రచించారు.
తెలంగాణ వ్యాస సంకలనాలు – రచయితలు
సంభాషణ: కె.శ్రీనివాస్
గనుమ: సుంకిరెడ్డి నారాయణరెడ్డి
ముద్దెర: ముదిగంటి సుజాతారెడ్డి
ప్రాణహిత: అల్లం నారాయణ
ఆవర్తనం: నందిని సిధారెడ్డి
జై బోలో తెలంగాణ సినిమా ద్వారా తెలంగాణలో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన సినీ దర్శకుడు శంకర్.
జానపద కళారూపాల ద్వారా తెలంగాణ ఉద్యమానికి తోడ్పడిన వారు
మిద్దెరాములు: ఒగ్గుకథ
చిందు ఎల్లమ్మ: చిందు యక్షగానం
దర్శనం మొగులయ్య: పన్నెండు మెట్ల కిన్నెర