Crypto Currency: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన క్రిప్టో కరెన్సీలు.. బిట్‌కాయిన్ క్రాష్ కొనసాగుతుందా..?

Crypto Currency: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన క్రిప్టో కరెన్సీలు.. బిట్‌కాయిన్ క్రాష్ కొనసాగుతుందా..?

Bitcoin Prices: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండితో పాటు క్రిప్టో ఇన్వెస్టర్లకు కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీలు ప్రస్తుతం ట్రంప్ టారిఫ్స్ భయాలతో కుప్పకూలటం ఆందోళనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం క్రిప్టోల్లో భారీ అమ్మకాలు కొనసాగటానికి ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కి తీసుకునేందుకు లిక్విడేట్ చేయటమే కారణంగా వారు చెబుతున్నారు. 

నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోల్లో కొనసాగుతున్న అమ్మకాలతో దిగ్గజ కరెన్సీ బిట్ కాయిన్ 80వేల డాలర్ల కిందకు పడిపోయింది. వాస్తవానికి ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు రుచిచూడటంతో ఎక్కువ పెరుగుదలను ఇది చూసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా ఉన్న ఈథరమ్ కూడా అమ్మకాల ఒత్తిడితో చిత్తైంది. దీంతోపాటు ప్రధాన క్రిప్టో కెన్సీల ధరలు నేడు ఇంట్రాడేలో 6 నుంచి 12 శాతం మధ్య కరెక్షన్ చూస్తున్నాయి. 

ఉదయం 11.25 గంటల సమయంలో బిట్ కాయిన్ ధర 8 శాతం పతనంతో ఒక్కోటి 76వేల 828 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. కేవలం 24 గంటల సమయంలోనే ఈ క్రిప్టో దిగ్గజ ధర దాదాపు 6వేల డాలర్లకు పైగా పడిపోవటం ఆందోళనలను పెంచుతోంది. దీంతో మార్చి నెల కనిష్ఠాలకు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ధర దిగజారింది. సెంటిమెంట్లు మెరుగుపడితే త్వరలోనే ధరలు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని జియోటస్ క్రిప్టో ప్లాట్‌ఫామ్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ధరల వద్ద డబల్ బాటమ్ నమోదు చేస్తుందని, మధ్యకాలంలో బుల్లిష్‌గా ఉండవచ్చని క్రిప్టోపై తన అంచనాలను వెల్లడించారు. 

►ALSO READ | Black Monday: 40 ఏళ్ల తర్వాత స్టాక్ మార్కెట్లో సేమ్ సీన్ రిపీట్.. ఈ 20 లక్షల కోట్ల రికవరీ ఎప్పటికయ్యేనో..?

ప్రస్తుతం పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనంగానే ఉంది, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ 'ఎక్స్‌ట్రీమ్ ఫియర్' వైపు కదులుతోందని ముద్రెక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడుల్ పటేల్ వెల్లడించారు. అమెరికా ఫెడరల్ ఎజెన్సీలు క్రిప్టో పెట్టుబడుల డేటాను బహిర్గతం చేసే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితులు రానున్న రోజుల్లో ధరలను ప్రేరేరించవచ్చని అన్నారు. అయితే పరిస్థితులు మెరుగుపడకపోతే రానున్న కొన్ని వారాల్లో బిట్ కాయిన్ ధర 72వేల డాలర్ల మార్కు కిందకు దిగజారే అవకాశం ఉందని సుబ్బరాజ్ అన్నారు. 

నేడు ఇంట్రాడేలో సొలానా 12 శాతం పతనం కాగా, బినేన్స్ కాయిన్ 6 శాతం, రిప్పిల్ 12 శాతం పతంతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీల పతనం కారణంగా పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.13 లక్షల కోట్ల మేర ఆవిరైంది. 

క్రిప్టో మార్కెట్ల క్షీణతపై నిపుణుల మాటేంటి?
ఆప్షన్స్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని సూచిస్తున్నాయని డిజిటల్-అసెట్ ప్రైమ్ బ్రోకరేజ్ ఫాల్కన్‌ఎక్స్‌లోని APAC డెరివేటివ్స్ హెడ్ సీన్ మెక్‌నల్టీ బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. మ్యాక్రో పరిణామాలు ప్రస్తుతం దీనిని నడిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు బలహీనంగానే ఉన్నాయి.

మార్కెట్ల ప్రస్తుత గమనంపై జియోటస్ క్రిప్టో ప్లాట్‌ఫాం సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ కీలక కామెంట్స్ చేశారు. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలపై కూడా పడిందని ఆయన అన్నారు. కీలక ఇండికేటర్ బిట్ కాయిన్ కూడా భారీ పతనాన్ని చూడటంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకోవచ్చనే సంకేతాలను అందించిందని అన్నారు. అమెరికా మార్కెట్లలోని కీలక సూచీలు 5 శాతం పతనాన్ని చూడటం దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ కీలక లెవెల్ 78వేల డాలర్ల మార్కు వద్ద ఉండగా.. ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ మార్కెట్లలో పాజిటివ్ దృక్కోణాన్ని సూచిస్తుందన్నారు. ఈ లెవల్స్ కిందకు బిట్ కాయిన్ దిగజారితే 72 వేల డాలర్లు కీలక జోన్ అవుతుందన్నారు. నేడు ప్రపంచ మార్కెట్లలో కనిపించిన పతనంతో ఈథరమ్, సొలానో, ఎక్స్ఆర్పీ వంటి ఇతర కీలక క్రిప్టోలను 16 శాతం వరకు నష్టపోయేలా చేసిందని సుబ్బరాజ్ వెల్లడించారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి కొత్త పెట్టుబడుల రూపంలో డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు ముందు అస్థిరతల దృష్ట్యా మార్కెట్లు ఇంకెంత వరకు కిందకు పడే అవకాశాలు ఉన్నాయో ముందుగా పరిశీలించటం ముఖ్యమని ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక చేశారు.