
న్యూఢిల్లీ: యూఎస్‌లో ట్రంప్ గెలవడంతో బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు దూసుకుపోతున్నాయి. బిట్‌కాయిన్ మొదటిసారిగా 80 వేల డాలర్ల (రూ.67 లక్షల) లెవెల్‌ను ఆదివారం దాటింది. 4.7 శాతం పెరిగింది. ఎథీరియం, సోలానా 4 శాతం వరకు పెరగగా, డోజికాయిన్ 18 శాతం ర్యాలీ చేసింది. డిజిటల్ అసెట్స్ ఇండస్ట్రీకి యూఎస్‌ను కేంద్రంగా మారుస్తామని, బిట్‌కాయిన్ నిల్వలను పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.