- రూ.71 లక్షలకు బిట్‌కాయిన్
- నెక్స్ట్టార్గెట్ రూ.84 లక్షలు!
న్యూఢిల్లీ: యూఎస్‌లో ట్రంప్ గెలిచాక బిట్‌కాయిన్ వెనక్కి తిరిగి చూడడం లేదు. 75 వేల (సుమారు రూ.63 లక్షల) మార్క్‌ను దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేసిన కొన్ని రోజుల్లోనే 84 వేల డాలర్ల లెవెల్‌ను అధిగమించింది. క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా పాలసీలను యూఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ సోమవారం 1.66 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ క్రిప్టో సోమవారం 6 శాతానికి పైగా ర్యాలీ చేసి 84,800 డాలర్ల ((రూ.71.23 లక్షల) వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.
బిట్‌కాయిన్ గత ఏడు రోజుల్లో 23 శాతం రిటర్న్ ఇచ్చింది. బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు రావడంతో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ క్రిప్టోలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ గోల్డ్‌గా దీని స్థానం మరింత స్ట్రాంగ్‌గా మారిందని ఎనలిస్టులు చెబుతున్నారు. బిట్‌కాయిన్‌కు లక్ష డాలర్ల (రూ.84 లక్షల) దగ్గర సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉండొచ్చని అన్నారు. రెగ్యులేషన్స్ ఫేవర్‌గా ఉండడం, ఈటీఎఫ్‌లు పెరగడం, బిట్‌కాయిన్ సప్లయ్ తక్కువగా ఉండడంతో ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్లు ఈ క్రిప్టోలోకి భారీగా వస్తాయని చెబుతున్నారు.