ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్, కామెంటేటర్ సి. వెంకటేశ్ క్రికెట్‌పై రాసిన ‘బిట్స్ అండ్ పీసెస్: ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్’ పుస్తకాన్ని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ సోమవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర నాథ్, కమర్షియల్ ట్యాక్సెస్ మాజీ జాయింట్ కమిషనర్ పీవీ సుబ్బారావు, మాజీ అడిషనల్ కమిషనర్‌వి. హర్షవర్దన్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ క్రికెటర్లు శ్రీధర్, మధు, అనిల్ రెడ్డిని సన్మానించారు.