
రాజస్థాన్ రాష్ట్రం పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) – బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్(బిట్‌శాట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు ఉంటాయి. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి.
అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బిట్‌శాట్-2023 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు) చెల్లించాలి. ఆన్లైన్లో ఏప్రిల్ 9వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bitsadmission.com వెబ్సైట్లో సంప్రదించాలి.