కర్ణాటకలోని చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎన్. శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే...కర్ణాటకలోని మైసూరు జిల్లాలో సీఎం సిద్ధరామయ్య పర్యటించారు. పర్యటనలో భాగంగా పెరియపట్టణ తాలూకాలోని ముత్తిన ముల్లుసోగే గ్రామంలో కావేరి నది నుంచి 150 చెరువులను నింపే ఓ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ క్రమంలోనే మోటార్ బటన్ ఆన్ చేద్దామని వచ్చిన సీఎంకు చేదు అనుభవం ఎదురైంది. సిద్ధరామయ్య బటన్ ఎంత నొక్కిన మోటార్ ఆన్ కాలేదు. దీంతో ఆయన అధికారుల పై కోపడ్డారు. సీఎం కార్యక్రమానికి వచ్చే ముందు ముందస్తు చర్యలు తీసుకోలేదని విధి నిర్వహాణలో అలసత్వం వహించారని ఎం.డీ శ్రీధర్ బాబును సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం బటన్ నొక్కిన మోటార్ ఆన్ కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత నొక్కిన ఆన్ కాలేదు పాపం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.