- సొంత నియోజకవర్గంలో మంత్రి కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ నాయకులు
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు అభివృద్ధి పనులకు హాజరైన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాన్వాయ్ ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మంత్రి వచ్చే మార్గంలో మొహరించిన బీజేపీ కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్న జీవో 317 ను వెంటనే సవరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు బీజేపీ కార్యకర్తల వెంట పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నారు. మంత్రి కారును వెళ్లేలా చేశారు. నినాదాలు చేస్తున్న బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇవి కూడా చదవండి
ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి
ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా