ఆస్ట్రేలియా మిస్టరీ స్పిన్నర్ 'షేన్ వార్న్' జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'వార్నీ' మూవీ షూటింగ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ సెక్స్ చేయబోయి లీడ్ యాక్టర్స్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మూవీలో షేన్ వార్న్ పాత్రలో ఆస్ట్రేలియా నటుడు అలెక్స్ విలియమ్స్ నటిస్తుండగా.. అతని భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది.
షేన్ వార్న్ స్త్రీలోలుడనే విషయం ప్రపంచానికి తెలిసిందే. అతడు యుక్త వయసులో ఉన్నప్పుడు.. సిమోన్‌తో జరిపిన శృంగార కథనం గురుంచి చిత్రీకరించాలన్నది కథలోని అంశం. అందులో భాగంగా మొదట ఇద్దరూ కారిడార్ లో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి పరుగెత్తుకెళ్లి, అక్కడున్న బెడ్‌పై పడిపోవాలన్నది సీన్. కానీ వారిద్దరూ క్యారెక్టర్లలో లీనమైపోవడంతో బెడ్‌పై కాకుండా.. కింద పడిపోయారు. దీంతో గాయాలయ్యాయి. అలెక్స్ తలకు బ్యాండేజ్ వేయగా.. కెన్నెడీ మణికట్టుకు గాయమైంది.
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్ గా పేరు గడించిన షేన్ వార్న్ గతేడాది గుండెపోటుతో మరణించాడు. వార్న్.. థాయ్‌లాండ్ వెకేషన్‌లో ఉన్నప్పుడు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో 708 వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం.