లేడీ జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి

లేడీ జర్నలిస్ట్ పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి

ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.. అది కవరేజ్ చేయడానికి వెళ్లిన ఓ లేడీ జర్నలిస్ట్, కెమెరామ్యాన్ పై కుక్కులు విడిచిపెట్టారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో జరిగింది. బిజూ జనతా దళ్ సినియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘనందన్ దాస్ పై మంగళవారం (జూన్ 25) పోలీస్ కేసు నమోదైంది. ఒడియా న్యూస్ ఛానల్ ఆర్గస్ న్యూస్ రిపోర్టర్ చిన్మయి సాహూ ప్రణబ్ ప్రకాష్ దాస్ ప్రభుత్వ క్వార్టర్స్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను  కూల్చివేస్తున్నారు. 

అదే సమయంలో  ఆ న్యూస్ కవర్ చేయడానికి జర్నలిస్ట్ చిన్మయి ఆమె కెమెరామ్యన్ తో కలిసి అక్కడికి వెళ్లారు. పక్కనే ఉన్న రఘునందన్ దాస్ ఇంటి నుంచి కెమెరా కవర్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత లైవ్ కవరేజ్ కోసం మాజీ మంత్రి ఒప్పుకోలేదు. పైగా వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించారు. జర్నలిస్ట్ , కెమెరామ్యన్ పైకి రఘునందన్ దాస్ రెండు కుక్కలను వదిలారు. ఈ ఘటనపై చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.