- జీవో 27తో దోపిడీని ప్రోత్సహిస్తున్నరు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లై శాఖ పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మిల్లర్లకు వానాకాలం వడ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 27 అవినీతిని ప్రోత్సహించేలా ఉందని మండిపడ్డారు. ఈ శాఖలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ స్టేట్ ఆఫీస్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘జీవో నంబర్ 27లో బ్యాంకు గ్యారంటీల కోసం కాంట్రాక్టర్లు, మిల్లర్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా డివైడ్ చేశారు. అయితే.. వాళ్లు 10, 20, 30 శాతం ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తామంటున్నరు. మరి మిగిలిన 70శాతం ధాన్యానికి ఎవరు గ్యారంటీ ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి’’అని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.