- బీజేఏల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
- నిమ్మల చరిత్ర షార్ట్ ఫిలిం ఆవిష్కరణ
నిర్మల్, వెలుగు : భవిష్యత్ తరాలకు స్థానిక చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లోకల్ హిస్టరీ సేకరణకర్త దొండి శ్రీనివాస్ రూపొందించిన నిమ్మల చరిత్ర షార్ట్ ఫిలిం సీడీని సోమవారం నిర్మల్పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆయన ఆవిరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ చరిత్ర ఎంతో గొప్పదన్నారు.
నిమ్మనాడి పాలనలో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లిందని తెలిపారు. ఇక్కడి చారిత్రక కోటలు, బురుజులు, కందకాల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాండ్రే రామరాజ్, గోనుగుప్పుల రాజశేఖర్, ప్రొఫె సర్ కటకం మురళి, రాసం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సాపూర్(జి), వెలుగు : దిలావర్ పూర్ మండలంలోని బన్సపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. తాలు లేని ధాన్యాన్ని సెంటర్కు తీసుకురావాలని సూచించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.