నిర్మల్, వెలుగు : అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపై బీజేపీ తరఫున పోరాటం చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేఎల్పీ నేతగా ఎన్నికైన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు.
కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ యోగేశ్ శర్మ, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, దాసరి వేణుగోపాల్, మనోజ్, రాజశేఖర్, జిల్లా సహ కార్యదర్శి పోశెట్టి, కార్యవర్గ సభ్యులు రవి కుమార్, ప్రసాద్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.