- ఆయన హిందువో, ముస్లిమోచెప్పాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందు ఆయన మతం, కులమేంటో చెప్పాలని, ఆ తర్వాత కుల గణనపై మాట్లాడాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్.. ఆయన మనవడు రాహుల్ జహంగీర్ కావాలి.. కానీ, గాంధీ ఎలా అయ్యారు. ఆయనకు దేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసా?’’అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం, మతం గురించి మాట్లాడిన వారిపై కర్నాటకలో కేసులు పెట్టారని, ఇప్పుడు తాను మాట్లాడుతున్నానని, తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడనన్నారు.