ముగిసిన బీజేపీ 24 గంటల రైతు హామీల సాధన దీక్ష..

ముగిసిన బీజేపీ 24 గంటల రైతు హామీల సాధన దీక్ష..

సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) ఇందిరా పార్క్ లో బీజేపీ చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష ముగిసింది. సోమవారం రాత్రి దీక్ష శిబిరంలోనే నిద్రపోయిన బీజేపీ నేతలు తిరిగి మంగళవారం ( అక్టోబర్ 1, 2024 ) ఉదయం దీక్ష ప్రారంభించారు. 24 గంటలపాటు సాగిన ఈ దీక్షలో పాల్గొన్న బీజేపీ కీలక నేతలు.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రికి వయసు అయిపోయిందని, ప్రభుత్వాన్ని మేల్కొలిపేలా దీక్ష సాగిందని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో  గిట్టుబాటు ధర లు ఎంత ఉన్నాయి... మోదీ హయాం లో రైతు గిట్టుబాటు ధరలు ఎలా పెరిగాయో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు పచ్చి మోసాలు గా మిగిలి పోయాయని, ఈ దీక్ష లు ప్రతి జిల్లా కు విస్తరించాలని పిలుపునిచ్చారు.

ALSO READ | కేటీఆర్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

డబ్బున్నోళ్ల దగ్గర వసూళ్ల కోసమే హైడ్రా ను ఏర్పాటు చేశారని మండిపడ్డారు అరవింద్. కాంగ్రెస్ నాయకులు రైతులు, మహిళలు, యువత, ఎన్నారై లను మోసం చేసి జేబులు నింపుకున్నారని అన్నారు. కాళేశ్వరం నీరు ఎత్తి పోసిన నీరు మారేందుకు ఒక్క కిలోమీటర్ కాలువ తీయలేదని అన్నారు. అవినీతి కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పనిచేశాయని అన్నారు.కేసీఆర్ కు పోరగాళ్ళు ఎవరైనా ఓటేస్తారా అని ఎద్దేవా చేశారు.

ఈ దీక్షలో పాల్గొన్న బీజేఎల్పీ నేత యేలేటి మహేశ్వర వంటి నేతలు కూడా ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గజినీలా ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారని అన్నారు. ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా 8 నుంచి 9శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు.