లోక్ సభ ఎన్నికలకు బీజేపీ మూడో జాబితా రిలీజ్ చేసింది. తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై పోటీ చేస్తున్నారు.
బీజేపీ ఫస్ట్ లిస్టులో 194 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 72 మందిని ప్రకటించింది. ఇపుడు మూడో జాబితాలో 9 మందిని ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు బీజేపీ 275 మందిని ప్రకటించింది.
9మందితో మూడో జాబితా
- చెన్నై సౌత్ - తమిళి సై సౌందర రాజన్
- కోయంబత్తూరు -అన్నామలై
- చెన్నై సెంట్రల్- వినోజ్ పి. సెల్వన్
- వెల్లూర్ - ఏసి. శన్ముగమ్
- క్రిష్ణగిరి -సి.నరసింహన్
- నీలగిరి - ఎల్. మురుగన్
- పెరంబలూరు - పారివేందర్
- తూత్తుకూడి - నైనార్ నాగేంద్రన్
- కన్యాకుమారి - రాధాకృష్ణన్