గ్రేటర్‌‌లో బీజేపీ దూకుడు.. టార్గెట్‌‌ 70 సీట్లు

గ్రేటర్‌‌లో బీజేపీ దూకుడు.. టార్గెట్‌‌ 70 సీట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్పీడ్ పెంచిన నేతలు

డివిజన్ల వారీగా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఆరు జిల్లాలుగా గ్రేటర్ విభజన.. జిల్లా అధ్యక్షుల నియామకం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో అదే స్థాయిలో కమలం పార్టీ కూడా రెడీ అవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా ఆరు జిల్లాలుగా విభజించుకున్న నేతలు.. వాటికి మంగళవారమే కొత్త అధ్యక్షులను నియమించారు. డివిజన్ల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని కొత్త అధ్యక్షులను రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది.

టార్గెట్‌‌ 70 సీట్లు

జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లుండగా, అందులో బీజేపీకి నలుగురు కార్పొరేటర్లే ఉన్నారు. ఇప్పుడు 70 సీట్లపై కన్నేసిన కమలం, ఆ సీట్లను గుర్తించి అందులో గెలుపు అవకాశాలపై కసరత్తు చేస్తోంది. గ్రేటర్లో తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం మరింత కలిసి వస్తుందనే భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్లు కీలకం కానుండటం, దానికి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడం, ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉండటంతో ఇది తమకు బాగా అనుకూలిస్తుందనే ధీమాలో పార్టీ క్యాడర్ ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్త పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టడం, ఆయా డివిజన్లలో వారు పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం తమ పార్టీకి మేలు చేస్తుందని నేతలు నమ్ముతున్నారు.

For More News..

రాజ్​భవన్​ మహిళలకు ఉపాధి శిక్షణ ప్రారంభించిన గవర్నర్

ఘాటెక్కిన ఉల్లి.. కిలో @ 60

సరికొత్తగా ‘వన్​ టీచర్ ​వన్​ స్టూడెంట్’