కరీంనగర్ సిటీ/ ముస్తాబాద్/గంభీరావుపేట్/ సిరిసిల్ల టౌన్ వెలుగు: కరీంనగర్ లో ఎంఐఎం, బీఆర్ఎస్ అరాచకాలు మితిమీరిపొతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు అన్నారు. బండి సంజయ్ ఆఫీస్‌పై దాడికి నిరసనగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఎంఐఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాలశ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, సాయిని మల్లేశం, గడ్డం నాగరాజు, రాపర్తి ప్రసాద్, బొంతల కల్యాణ్ పాల్గొన్నారు. అలాగే ముస్తాబాద్ గంభీరావుపేట్ మండల కేంద్రాలలో అసదుద్దీన్ ఓవైసీ దిష్టి బొమ్మలని దహనం చేశారు. కార్యక్రమంలో కస్తూరి కార్తీక్ రెడ్డి , గంట అశోక్ దేవేందర్ యాదవ్, క్రిష్ణ , క్రాంతి , స్వామి , క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు .
సిరిసిల్ల అంబేడ్కర్ చౌక్ లో బీజేపీ అధ్వర్యంలో ఎంఐఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కరీంనగర్ లో ర్యాలీ తీస్తున్న ఎంఐఎం నాయకులు రూట్ మ్యాప్ లేని ఏరియా వచ్చి ఎంపీ ఆఫీస్ వద్ద నుంచి ర్యాలీ తీసి కార్యాలయం, ఇంటి పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజీపీ నాయకులు అడెపు రవీందర్, రెడ్డ బోయిన గోపి, నాగుల శ్రీనివాస్, బర్క నవీన్ యాదవ్ పాల్గొన్నారు.