
భైంసా, వెలుగు: బైంసా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో పట్టణ కమిటీ నాయకులు ఆదివారం అధ్యక్షుడు ఎ.మల్లేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు.
ఈ సదర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ భైంసా మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీలను గెలిపించిన ఓటర్లకు, కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడిన వారిని పార్టీ కచ్చితంగా గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ బండారి దిలీప్, మాజీ కౌన్సిలర్ గౌతమ్, పోశెట్టి ఇతర లీడర్లు పాల్గొన్నారు.