![ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ.. అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చిన ఆప్](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-and-aap-contest-in-delhi-assembly-election-results_JUGcg9RLin.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార ఆప్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ అధిపత్యం ప్రదర్శిస్తూ.. మేజిక్ ఫిగర్ (36) క్రాస్ చేసింది. తొలుత ఫలితాల్లో వెనకబడ్డ ఆప్.. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. ప్రస్తుతం బీజేపీ 42 చోట్ల, ఆప్ 27 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆప్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి.
ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిశీ మొదట వెనకబడ్డారు. రెండు రౌండ్లో అనంతరం వీరు అధిక్యంలోకి వచ్చారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ లీడింగ్‌లోకి దూసుకు రాగా.. జంగ్ పురాలో మనీష్ సిసోడియా ఎట్టకేలకు అధిక్యంలోకి వచ్చారు. కల్కాజీలో సీఎం అతిశీ కూడా మూడు రౌండ్ల తర్వాత ఎట్టకేలకు లీడింగ్‌లోకి వచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల మూడవ స్థానానికి పరిమితమైంది.
ALSO READ | ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతల వెనకంజ.. ఫలించని అగ్రనేతల ప్రచారం..
తొలుత ఒకటి, రెండు స్థానాల్లో అధిక్యం కనబర్చిన కాంగ్రెస్ తర్వాత అక్కడ కూడా అధిక్యం కోల్పోయింది. బీజేపీ, ఆప్ అభ్యర్థుల స్వల్ప ఓట్ల మార్జిన్ మాత్రమే ఉండటంతో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్ అంచనాల మేరకు బీజేపీ ఇప్పటికే ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ (36) స్థానాలు దాటేసింది. దీంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.