
నెట్వర్క్, వెలుగు: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. సర్కా
రుకు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, గ్రూప్2 ఎగ్జామ్ వాయిదా వేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకు మంచిర్యాల బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్‌రావు సంఘీభావం తెలిపారు.
నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ఎదుట నిరసనకు పిలుపునిస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి జిల్లావ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల ఆంజేయులు, గుండా ప్రభాకర్, బోయిని దేవేందర్, అమిరిశెట్టి రాజు, బోయిని హరికృష్ణ, పల్లి రాకేశ్, రాకేశ్ రేన్వ, స్వామిరెడ్డి, రావనవేని శ్రీనివాస్, రెడ్డిమల్ల అశోక్, ఏముర్ల ప్రదీప్, బింగి సత్యనారాయణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం నాయకులు శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు బీజేవైఎం నేతలు ధర్నా చేశారు.
బీజేపీ, బీజేవైఎం లీడర్ల అరెస్టులు
బీజేపీ, బీజేవైఎం నాయకుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణను అరెస్టు చేసేందుకు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లగా తప్పించుకొని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
కలెక్టరేట్ ఆవరణలో కూర్చొని నిరసన తెలుపుతుండగా బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతోపాటు జన్నారం, నస్పూర్తదితర ప్రాంతాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
యువతను గంజాయి,మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం
నిరుద్యోగ యువతను కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందని, బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని.. యువతను గంజాయికి, మద్యానికి బానిసలను చేస్తోందని ఫైర్అయ్యారు. నిరుద్యోగ భృతి హామీకే పరిమితమైందని, 56 నెలలు గడుస్తున్నా దాని ఊసేలేదన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగడాలకు అదుపు లేకుండా పోతోందని, మాస్టర్ ప్లాన్ పేరిట ఇష్టారాజ్యంగా జోన్లను మార్చి నిబంధనలకు తూట్లు పొడిచారన్నారు. జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు వొడిసెల అర్జున్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ రావుల రామనాథ్, నాయకులు కుమ్మరి వెంకటేశ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.