బీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!

బీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!
  • సంఘాలు కోరిన ఢిల్లీ  తరలని లీడర్స్
  • హాట్ టాపిక్ గా కారు, కమలం నేతల గైర్హాజరు
  •  రేపు 9వ షెడ్యూల్ సవరించాలంటూ ఆందోళన

హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఢిల్లీలో ధర్నా చేసేందుకు బీసీ సంఘాల నేతలు తరలివెళ్లారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అయితే పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్  పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అదే విధంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ కూడా ఈ ఆందోళనలో పాల్గొనకపోవడం గమనార్హం.

 సాక్షాత్తూ బీసీ సంఘాల నేతలు స్వయంగా వెళ్లి ఈ రెండు  పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. అయినీ ఈ రెండు పార్టీల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. బీజేపీ, బీఆర్ఎస్  నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.