నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ ఇవ్వాలంటూ ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు ఆశావహులు. ఎమ్మెల్సీ టికెట్ ను ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రకాశ్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే తీన్మార్ మల్లన్న పేరు ఖరారైంది. దీంతో త్వరగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోంది అధిష్టానం.
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ లో ఆశవాహులు పెద్దఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో... మళ్లీ గెలువాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకొచ్చిన నేతలకు ఎమ్మెల్సీ సీట్లపై బీఆర్ఎస్ హామి ఇచ్చింది. దీంతో కొత్త వారికి పట్టభద్రల ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు.