కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

చందానగర్, వెలుగు : శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్​కు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్​గౌడ్​ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని వారికి ఆయన సూచించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి వివరించాలన్నారు. ఈ 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేయాలన్నారు. 

ALSO READ: ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం : రోనాల్డ్ రాస్