మునుగోడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..

మునుగోడు ఉప ఎన్నికకు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది.  ఈ జాబితాలో బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, విజయశాంతి , బొడిగే శోభ, సినీనటి జీవిత రాజశేఖర్ తదితరులు ఉన్నారు. మొత్తం 40 మంది  స్టార్ క్యాంపెయినర్ల వివరాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్ కు బీజేపీ సమర్పించింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పార్టీ అభ్యర్థి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా 38 మంది నేతల పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా మొత్తం 86 మంది నేతలను ఇంచార్జిలుగా ప్రకటించింది.