బీజేపీ సంస్థాగత ఎన్నికలకు 13 మంది ఇన్ చార్జీల నియామకం

  • అబ్జర్వర్ల లిస్టు విడుదల చేసిన బీజేపీ స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణకు ఆ పార్టీ ఇన్ చార్జీలను నియమించింది. ఒక్కొక్కరికి మూడేసి చొప్పున 13 మందికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బీజేపీ స్టేట్  ఎలెక్షన్  ఆఫీసర్, స్టేట్  వైస్ ప్రెసిడెంట్  యెండల లక్ష్మీనారాయణ అబ్జర్వర్ల లిస్టును శుక్రవారం రిలీజ్  చేశారు. మండల, జిల్లా ఎన్నికలను వారు పర్యవేక్షించనున్నారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్  -జిల్లాలకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలకు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు.. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్  జిల్లాలకు -దుగ్యాల ప్రదీప్  కుమార్.. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు కాసం వెంకటేశ్వర్లు.. రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, నాగర్  కర్నూల్  జిల్లాలకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.. ములుగు, భూపాలపల్లి, వరంగల్  జిల్లాలకు బంగారు శ్రుతి.. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్  -జిల్లాలకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు.. మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు పెద్దోళ్ల గంగారెడ్డి.. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం -జిల్లాలకు పేరాల శేఖర్.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, సూర్యాపేట జిల్లాలకు ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్..  మంచిర్యాల రూరల్, మంచిర్యాల  అర్బన్, సికింద్రాబాద్  జిల్లాలకు కట్టా సుధాకర్ రెడ్డి.. సిరిసిల్ల, హనుమకొండ, జనగామ జిల్లాలకు తల్లోజి ఆచారి..  హైదరాబాద్  సెంట్రల్, గోల్కొండ, గోషామహల్, భాగ్యనగర్, మలక్​పేట జిల్లాలకు జి.మనోహర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.