అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది తెలంగాణ బీజేపీ. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి నియమించింది బీజేపీ అధిష్టానం. మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా రాజ్ గోపాల్రెడ్డి, కన్వీనర్ గా దుగ్యాల ప్రదీప్ కుమార్, పబ్లిక్ మీటింగ్ కమిటీ చైర్మన్గా బండి సంజయ్, కన్వీనర్ గా ప్రేమేందర్ రెడ్డి, ఇన్ ఫ్లుయెన్సర్ ఔట్ రీచ్ చైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి, పోరాటాల కమిటీ చైర్ పర్సన్ గా విజయశాంతి, కన్వీనర్ గా గొంగిడి మనోహర్ రెడ్డిని నియమించారు.
Also Read :- కాకా తయారుచేసిన నాయకులు దేశంలో పెద్ద ఎత్తున ఉన్నరు
కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ ధర్మపురి అర్వింద్, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు, సోషల్ అవుట్ రీచ్ చైర్మన్ గా ఎంపీ లక్ష్మణ్, కన్వీనర్ గా బూర నర్సయ్య గౌడ్ లను నియమించింది రాష్ట్ర బీజేపీ. హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి, కన్వీనర్ గా శృతి బంగారు, క్యాంపెయిన్ ఇష్యూస్ టేకింగ్ పాయింట్ కమిటీ చైర్మన్ గా వెదిరె శ్రీరామ్, కన్వీనర్ గా ఎన్. వీ.వీ. ఎస్ ప్రభాకర్ ను నియమించారు. ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ చైర్మన్ గా జితేంద్రారెడ్డి, కన్వీనర్ గా విజయరామారావు, ఎస్టీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావు, కన్వీనర్ గా సోయం బాపూరావు, జాయింగ్ కన్వీనర్ గా రవీంద్ర నాయక్ ను నియమించారు.