ఇల్లెందు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఇల్లెందు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రవీందర్ నాయక్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో దండుకోవడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు.
రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేందుకు బీఆర్ఎస్కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా సమన్వమకర్త సోమసుందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనువాస్, నియోజకవర్గ కన్వీనర్ గోపికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.