ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 'బీ'టీమ్‌‌‌‌గా కాంగ్రెస్ .. రాహుల్ కు మాయావతి కౌంటర్

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 'బీ'టీమ్‌‌‌‌గా కాంగ్రెస్ .. రాహుల్ కు మాయావతి కౌంటర్

లక్నో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ "బీ టీమ్"లా వ్యవహరించిందని  బీఎస్‌‌‌‌పీ చీఫ్ మాయావతి అన్నారు. అందుకే  బీజేపీ గెలిచిందని.. కాంగ్రెస్ ఘోరంగా ఓడిందన్నారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మాయావతి ఇండియా కూటమిలో చేరకపోవడం తనను నిరాశపరిచిందని రాహుల్ ఇటీవల చేసిన కామెంట్ కు మాయావతి ఈ మేరకు  శుక్రవారం  'ఎక్స్' వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇతరులను వేలెత్తి చూపే ముందు రాహుల్ తన సొంత వ్యవహారాలను చూసుకోవాలని ఆమె హితవు పలికారు.