కోరుట్ల, వెలుగు : కోరుట్లలోని కల్లూరు రోడ్డు చౌక్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ, భజరంగ్‌దళ్ లీడర్లు డిమాండ్ చేశారు. కోరుట్లలో కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. కల్లూరు రోడ్డు చౌక్ వద్ద మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహం ఏర్పాటుకు పనులు కొనసాగుతుండగా అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు.
శివాజీ బ్యానర్ ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలని, ఇక్కడ శివాజీ విగ్రహాన్నిఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.