కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం: గెహ్లాట్​

కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం: గెహ్లాట్​

జోధ్‌‌పూర్: కిందటేడాది జరిగిన ఉదయ్‌‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య వెనుక బీజేపీ హస్తం ఉందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కన్హయ్య హత్యకు ముందే నిందితులిద్దరూ మరో కేసులో అరెస్టయ్యారని చెప్పారు. బీజేపీ నేతలే వారిని విడిపించుకుని తీసుకెళ్లారని వెల్లడించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన జోధ్‌‌పూర్ లో నిర్వహించిన పార్టీ మీటింగ్​లో పాల్గొని, మాట్లాడారు. రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు టెర్రరిస్టులకు సానుభూతిపరులంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అశోక్​ గెహ్లాట్​ మండిపడ్డారు.

ALSO READ : సీపీఎం సీనియర్ నేత వాసుదేవ ఆచార్య కన్నుమూత