బెంగాల్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలి: బీజేపీ

బెంగాల్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలి: బీజేపీ

మలక్ పేట, వెలుగు: పశ్చిమ బెంగాల్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ డిమాండ్​చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముష్కర మూకలు హిందువుల ఇండ్లపై దాడి చేసి చంపడం దారుణమన్నారు. ఆస్తుల ధ్వంసంతోపాటు లూటీ చేయడంతో భయంతో వందల మంది హిందువులు ఇండ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం స్పందించి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం సైదాబాద్ లో పార్టీ నాయకులతో కలిసి బెంగాల్​సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకావు అరుణారెడ్డి, నాయకులు సుభాశ్​చందర్ జీ, సహదేవ్ యాదవ్, కొత్తకావు రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, వీరేందర్ యాదవ్ పాల్గొన్నారు.