మల్లాపూర్, వెలుగు: మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని పెద్దమ్మతల్లి ఆలయం నుంచి మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ భరోసా యాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో లీడర్లు సత్యం, సత్యనారాయణ రావు , జె.ఎన్.వెంకట్, ప్రభాకర్, నవీన్ రావు , గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.
మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ
జమ్మికుంట, వెలుగు : జమ్మికుంటలో బీజేపీ దళిత మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా సేవాపక్షం జలమే జీవన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా కార్యదర్శి రాజేశ్ఠాగూర్, పట్టణ అధ్యక్షులు శనిగరపు రవి, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వెంకటేశ్, వెంకటస్వామి పాల్గొన్నారు.
బతుకమ్మలతో కాంట్రాక్టు కార్మికుల నిరసన
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులు, మహిళలు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. నిరవధిక సమ్మె చేస్తున్నా మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడంపై జేఏసీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఈయూ స్టేట్ ప్రెసిడెంట్ తుమ్మల రాజారెడ్డి, ఇప్టూ స్టేట్ ప్రెసిడెంట్ టి.శ్రీనివాస్, కాంగ్రెస్ ఇన్చార్జి మక్కాన్ సింగ్, సీపీఐ లీడర్ గౌతం గోవర్ధన్, టీఎల్‌పీ స్టేట్ ప్రెసిడెంట్ రమేశ్, జేఏసీ లీడర్లు కుమార స్వామి, రమేశ్, కె.విశ్వనాథ్, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని టీఎన్‌టీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి మేనేజ్‌మెంట్‌ను డిమాండ్ చేశారు.
జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
కాంట్రాక్టు కార్మికుల సమ్మె నేపథ్యంలో సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లలో పరిస్థితిపై సింగరేణి డైరెక్టర్ (పా) ఎస్.చంద్రశేఖర్, పర్సనల్ జీఎం ఎ.ఆనందరావు, చీఫ్‌సెక్యూరిటీ ఆఫీసర్ బి.హన్మంతరావు అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్మికుల హాజరు శాతం, పని పరిస్థితుల గురించి ఏరియాల జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.
బ్యాడ్మింటన్ పోటీల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించే బ్యాడ్మింటన్పోటీల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ ఆవిష్కరించారు. జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్స్థాపించి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను కాలేజీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 24, 25 తేదీల్లో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ఛాంపియన్షిప్పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలు 5 విభాగాలుగా జరుగుతాయని మరిన్ని వివరాలకు 9700395025, 9866125320 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ సాగర్ రావు, సెక్రటరీ జువాడి సుమిత్ సాయి పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో అంధత్వాన్ని జయించాలి
ఆత్మవిశ్వాసంతో అంధత్వాన్ని జయించి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంధుల ఆశ్రమ స్కూల్లో ఆర్వో ప్లాంట్ ను కలెక్టర్ ప్రారంభించారు.
మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ వేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మంగళవారం సంస్కృతి ఫౌండేషన్–హైదరాబాద్ సౌజన్యంతో ‘సంస్కృతి సంవాద్’ పేరిట మహిళా సాధికారత పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ‘భారతదేశ వివాహ వ్యవస్థలో విడాకుల పెరుగుదల– కారణాలు’ అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. స్టూడెంట్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. చీఫ్‌గెస్ట్‌లుగా హాజరైన అడ్వకేట్లు తిరుమల దేవి, గీత మాట్లాడుతూ మహిళ అభివృద్ధి, సాధికారతతోనే కుటుంబ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ గోపికృష్ణ, ఏసీవో బండి సంపత్ కుమార్, చీఫ్లైబ్రేరియన్ డా.ఎండీ.అలీ ఖాన్, ఏవో శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు కళల గురించి వివరించాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులకు కళల గురించి విశ్లేషించి చెప్పాలని దీంతో వారికి ఆసక్తి పెరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక రేకుర్తిలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో అల్ఫోర్స్ జూనియర్ కాలేజీల ఖుషీ పేరిట నిర్వహించిన కల్చరల్ప్రోగ్రామ్స్ లో చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ఆసక్తి కనబరిచేలా ప్రోత్సాహాకాలను అందించాలని సూచించారు. స్టూడెంట్స్ కల్చరల్ప్రోగ్రామ్స్ అలరించాయి.
ఎనిమిదేండ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలే..
ముస్తాబాద్ వెలుగు: ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో మా ఊరికి ఒక్క డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని ముస్తాబాద్ మండలం నామాపూర్ లో కాంగ్రెస్నాయకులు మంగళవారం రాస్తారోకో చేశారు. అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, అనిల్, రాజిరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, రాజు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: సిరిసిల్ల పట్టణంలో సమస్యలు పెరుగుతున్నాయని వాటిని మంత్రి కేటీఆర్ వెంటనే పరిష్కరించాలని డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖలో చాలా అవినీతి జరుగుతోందని, దీనికి మంత్రి సమాధానం చెప్పాలన్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి బడా వ్యాపారులకే లాభం జరుగుతోందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏం జరుగుతోందో మంత్రికి తెల్వదా అని ప్రశ్నించారు. వర్షాలు పడ్డటప్పుడుల్లా సిరిసిల్ల మునిగిపోతున్నా శాశ్వత పరిష్కారం చూపడంలేదన్నారు. బతుకమ్మ చీరలకు ఇంటర్నేషనల్ బ్రాండ్ కల్పించడం సంతోషమే కానీ వాటిని ఉత్పత్తి చేసే కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సంగీతం శ్రీనివాస్, కాముని వనిత, సూర దేవరాజు, ఆకునూరి బాల్ రాజు పాల్గొన్నారు.
వసూళ్ల పర్వంపై కేటీఆర్ సమాధానం చెప్పాలి
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం కోసం కొన్ని సంస్థల నుంచి డబ్బు వసూలు చేయడంపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారానికి కూడా డబ్బు ఖర్చుపెట్టలేని పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించారు. అధికార పార్టీ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నా మంత్రి ఎందుకు సైలంట్‌గా ఉంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శీలం రాజు, రాజాసింగ్ ఠాకూర్, అంజన్న, ప్రవీణ్, పాల్గొన్నారు.
వివేక్ ను కలిసిన కస్తూరి సత్యం
గొల్లపల్లి వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని మంగళవారం బీజేపీ ధర్మపురి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం హనుమకొండలో కలిశారు. సత్యం తన నియామకానికి సహకరించడం పట్ల వివేక్ వెంకటస్వామి ని కలిసి శాలువా పుష్పగుచ్ఛం ఇచ్చి థ్యాంక్స్చెప్పారు. ఆయనవెంట రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి సూర్య నారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ రాజేశ్ఉన్నారు.
అట్టడుగు కులాలకు ఓటుపై చైతన్యం కల్పిస్తాం
కరీంనగర్ సిటీ,వెలుగు: అట్టడుగు కులాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఓటుపై చైతన్యం కల్పించేందుకు 10 వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లు దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్ మహరాజ్ చెప్పారు. మంగళవారం 90వరోజు కొత్తపల్లి మండలం టీఆర్కే నగర్, మల్కాపూర్, ఎలగందుల గ్రామాలకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా డీఎస్పీ జెండా దిమ్మెలు, శిలా పలకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, నరేశ్, శ్రీకాంత్, రాకేశ్, సతీశ్, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, రవి పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మెట్ పల్లి, వెలుగు : దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి దేవీ నవరాత్రులు, దసరా ఏర్పాట్లపై కుల సంఘాలు, ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం క్యాంప్ ఆఫీసులో 50 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బల్దియా చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కమిషనర్ సమ్మయ్య, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.
ముదిరాజ్, గంగపుత్రులు ఆర్థికంగా ఎదగాలి
చొప్పదండి, వెలుగు: మత్సకారులు, ముదిరాజ్‌లు, బెస్త కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం చొప్పదండి మండలంలోని 50 చెరువులలో పెంచేందుకు చేప పిల్లలను ముదిరాజ్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటా చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులను బాగు చేసుకోవడం, కాళేశ్వరం నీటితో చెరువులను నింపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, ఎంపీపీ రవీందర్, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచులు రవి, సురేష్, కౌన్సిలర్లు శ్రీనివాస్, మహేశ్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.