ఆర్.కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ.. ఈసారి బీజేపీ నుంచి కన్ఫామ్

బీసీ ఉద్యమనేత ఆర్ కృష్ణయ్యకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.  రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య పేరును ఖరారు చేసింది.  మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ పార్టీ. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య పేరు ఫైనల్‌ అయింది.. హర్యానా నుంచి రేఖాశర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను ప్రకటించింది. 

డిసెంబర్ 10  నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి గడువు కావడంతో  ఈరోజు ( డిసెంబర్ 9)  బీజేపీ నాయకత్వం మూడు పేర్లను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.  ఆర్ కృష్ణయ్య విజయవాడలో  డిసెంబర్ 10న  ఉదయం 11 గంటలకు  రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది.