బీజేపీ బస్సు యాత్రలు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీజేపీ బస్సు యాత్రలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు కీలక నేతలు ఈ నెల26 నుంచి బస్సు యాత్రలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీలో నిర్ణయించారు. అయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేయాలని, అవసరమైతే పూర్తిగా రద్దు చేయాలని  ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. రాష్ట్రంలోని కీలక నేతల మధ్య సరైన సమన్వయం లేని కారణంగానే  బస్సు యాత్రలను హైకమాండ్ వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

పొలిటికల్ యాక్టివిటీస్ బాగా తగ్గించి..పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా బూత్‌‌లలో కమిటీలు వేయలేదని, అలాంటప్పుడు అక్కడ పార్టీ కార్యక్రమాలు ఎలా కొనసాగుతాయని హైకమాండ్ ప్రశ్నించినట్లు తెలిసింది. 

 

Also Rard:సనాతన ధర్మం అజరామరం
 

బూత్ కమిటీలను నియమించేందుకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. 

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి  సునీల్ బన్సల్ హైకమాండ్​కు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఢిల్లీ పెద్దలు ఈ ఆదేశాలిచ్చినట్లు చర్చ సాగుతోంది. మూడ్రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్య నేతలతో రివ్యూలో బన్సల్ ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం..అనుకున్నట్లుగానే అది అమలైన తీరును పార్టీ వర్గాలు గుర్తు చేశాయి.