అర్హులకు ‘డబుల్’ ఇండ్లు అందలే : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

చేర్యాల, వెలుగు: రాష్ట్రంలో  90 శాతం మంది అర్హులైన  పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు  అందకున్నా.. కేసీఆర్ కుటుంబానికి, మంత్రులకు ఫాం హౌసులు, వందల ఎకరాల భూములు వచ్చాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం చేర్యాలలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్​లో భాగంగా బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ​మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వంద మందికి ఒక బెల్టుషాపు ఉందని, మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తూ ప్రజల్ని తాగుబోతులుగా మారుస్తోందని మండిపడ్డారు.

 బచ్చన్నపేట, నర్మెట మండలాల నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.  కార్యక్రమానికి బల్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, సిద్దిపేట ఇన్​చార్జి అంజన్​కుమార్, జనగామ ఇన్​చార్జి పాపారావు, నరహరి వేణుగోపాల్​రెడ్డి, విద్యాసాగర్​రెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి బూర్గు సురేశ్​గౌడ్​, సౌడ రమేశ్, శివరాజ్ యాదవ్, లక్ష్మారెడ్డి, బి. బీరప్ప, బొంగోని సురేశ్ గౌడ్, పి. రాందాసు, నర్ర మహేందర్​రెడ్డి, కొంతం శ్రీనివాస్, హరిశ్చంద్ర గుప్తా, టి. ఉమారాణి, బొట్ల శ్రీనివాస్, కె. పాండు, కె. సురేందర్, భాస్కర్​రెడ్డి, వెంకట్​రెడ్డి, బిక్షపతి నాయక్, సోమిరెడ్డి పాల్గొన్నారు.