
పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీతాఫల్మండి శివాజీ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్దిష్టిబొమ్మను దహనం చేశారు.
తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు అంజన్ కుమార్ యాదవ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలో మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, అంజన్కుమార్యాదవ్పై క్రిమినల్కేసులు నమోదు చేయాలని గాంధీనగర్ పీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.