హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్ ను ఓడించాలి : బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 

హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్ ను ఓడించాలి : బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 
  • కరీంనగర్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 

నిజామాబాద్, వెలుగు: ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్​ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని కరీంనగర్ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​అంజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

యువ వికాసం పేరుతో యూత్​ను మోసగించిన కాంగ్రెస్​ తీరుపై విస్తృతంగా ప్రచారం చేయా లని సూచించారు.  విద్యార్థులకు స్కాలర్​షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు.  మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 
 
బీసీ బిడ్డను గెలిపించండి..– టీచర్స్​ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరముందని  టీచర్స్​ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. బీసీ బిడ్డనైన తనను గెలిపించాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​, అర్బన్​ ఎమ్మెల్యే  సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, జాతీయ పసుపు చైర్మన్​ పల్లె గంగారెడ్డి, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.