ఎంపీగా గెలిపిస్తే బంగారు భువనగిరి చేస్తా : బూర నర్సయ్య గౌడ్

  • బీజేపీ  అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు : తనను ఎంపీగా గెలిపిస్తే  పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గాన్ని బంగారు భువనగిరిగా అభివృద్ధి చేస్తానని  బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.  అనంతరం  ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. తాను భువనగిరి ఎంపీగా పనిచేసిన సమయంలో దాదాపుగా రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని గుర్తుచేశారు.   కేంద్రం సహకారంతో బీబీనగర్‌‌‌‌‌‌‌‌లో ఎయిమ్స్

భువనగిరిలో కేంద్రీయ విద్యాలయ, పాస్‌‌‌‌పోర్టు కేంద్రం, 524 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలు  అందుబాటులోకి తెచ్చానన్నారు.  రాయగిరి రైల్వేస్టేషన్ పేరు యాదాద్రిగా మార్చి.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను సాంక్షన్ చేయించానన్నారు.  ఈ సారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు భువనగిరి శ్యాంసుందర్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గుంటుపల్లి సత్యం, జిల్లా నాయకుడు కర్రె ప్రవీణ్ , కిషన్ నాయక్ పాల్గొన్నారు.