మోదీ అంటేనే త్రీడీ : బూర నర్సయ్యగౌడ్

చౌటుప్పల్ వెలుగు : మోదీ అంటేనే దేశం, ధర్మం, డెవలప్​మెంట్ (త్రీడీ) అని బీజేపీ భువనగిరి పార్లమెంట్అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా ద్వారా దేశం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో భువనగిరి పార్లమెంట్​కు రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పారు. తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు కంచర్ల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.