భూపాలపల్లి రూరల్, వెలుగు : తనను గెలిపిస్తే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం భూపాలపల్లిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానని బీజేపీ క్యాండిడేట్ చందుపట్ల కీర్తిరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆదరించి గెలిపిస్తే భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకురావడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు.
Also Read :- గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులతో కలిసి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి కాదని, గుట్టల రమణారెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్ సత్యనారాయణరావు ఎప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో అర్థం కావడం లేదన్నారు. పూటకో పార్టీ మారే లీడర్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సభలో జిల్లా అధ్యక్షుడు కన్నం యుగంధర్, వెన్నంపల్లి పాపన్న, ఎరుకల గణపతి, మధుసూదన్, రాజేందర్ పాల్గొన్నారు.