కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లను నిలదీయండి ; ధన్​పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్, వెలుగు: ఎన్నికలు రాగానే ఇంటింటికి తిరుగుతూ బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లను నిలదీయాలని అర్బన్ ​బీజేపీ అభ్యర్థి ధన్​పాల్ సూర్యనారాయణ కోరారు. సోమవారం నగరంలోని వివిధ కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా ఎమ్మెల్యే ఉన్న బిగాల గణేశ్​గుప్తా నగరాభివృద్ధి కోసం చేసిందేమీ లేదని, అరచేతిలో స్వర్గాన్ని చూపి నగరవాసులను భ్రమలో ఉంచారని ఆరోపించారు.  ప్రజా సమస్యలపై కాంగ్రెస్ లీడర్లు ఏ ఒక్కరోజైనా పోరాటం చేయలేదన్నారు. ఓటర్లు ఎవరి మాటలు నమ్మకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు.