నిజామాబాద్అర్బన్, వెలుగు : తనకు అవకాశమిస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇందూరు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 41వ డివిజన్లోని వివిధ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేండ్లలో అధికారంలో ఉన్న సిట్టింగ్ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నగరాభివృద్ధిని గాలికొదిలేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
ప్రజాల కనీస అవసరాలను సైతం తీర్చడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.